Niharika Divorce : ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడం సహజం. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి అయితే చెప్పనవసరం ఉండదు. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ప్రతి విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ విడాకుల విషయంలో ఇటు నాగబాబు కుటుంబం కానీ, అటు చైతన్య కుటుంబం కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ నిహారిక మాత్రం తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి ఈ వార్తలకి ముగింపు పలికింది.
ఈ నేపథ్యంలో చైతన్య నుంచి విడిపోయాక నీహారిక భరణంగా ఎంత తీసుకుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. భర్త నుంచి విడిపోయిన తర్వాత భరణంగా కొన్ని కోట్లు డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే నీహారిక కూడా 100 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం జరిగింది కానీ ఇందులో వాస్తవం లేదు. నిహారిక మాత్రం తన భర్త నుంచి ఒక్క రూపాయి భరణంగా వద్దు అంటూ తెగేసి చెప్పిందట. నా కాళ్ళ మీద నేను నిలబడి బతగ్గలను.. నాకు వాళ్ళ దయాదాక్షణ్యాలు అవసరం లేదంటూ తెగేసి చెప్పిందట. ఇక మీదట సినిమాలపై ఫోకస్ చేయనుంది మెగా డాటర్.