Oxygen-28 : శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కి మరొక కొత్త రూపాన్ని కనిపెట్టారు. దానిని “ఆక్సిజన్ 28″గా వాళ్ళు పిలుస్తున్నారు. ఆక్సిజన్ అను కేంద్రంలో ఇప్పటివరకు ఉన్నదానికన్నా ఎక్కువగా న్యూట్రాన్లను ఇది కలిగి ఉంది. ఆక్సిజన్ 28 నీ జపాన్ లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అణుశాస్త్రవేత్త యోసుకే నేతృత్వంలోని సైంటిస్ట్ ల బృందం కనిపెట్టారు.
ఇప్పటివరకు చూసినటువంటి ఆక్సిజన్ రూపాల్లో ఈ ఆక్సిజన్ 28 అత్యధిక సంఖ్యలో న్యూట్రాన్ లను ఉత్పత్తి చేస్తుందని ఆక్సీజన్ అణువు కేంద్రంలో తేలిందని ఈ ఆక్సిజన్ రూపాల్లో భారీదని చెప్తున్నారు. ఆక్సిజన్ 28 అధిక న్యూట్రాన్ టు ప్రోటాన్ నిష్పత్తిని కలిగి ఉండడమే చాలా అరుదని వాళ్ళు వెల్లడించారు. ఇంకా పరిశోధకుల బృందం చెప్పేదేమిటంటే పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు కలిగిన న్యూక్లియాన్ అనే సబ్అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని చెప్తున్నారు.
అయితే ఒక మూలకం యొక్క అటామిక్ నెంబర్ ప్రోటాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. న్యూట్రాన్ల సంఖ్య మాత్రం మారవచ్చు. న్యూట్రాన్ల సంఖ్య ఆ మూలకం యెక్క ఐసోటోపులను ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ 8 ప్రోటాన్లను కలిగి ఉంటుంది, అయితే న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉండొచ్చు. సైంటిస్టులు ఇదివరకే ఆక్సిజన్ 26 ని కనుగొన్నారు. దానిలో 8 ప్రోటాన్లు ఉంటే 18 న్యూట్రాన్లు మొత్తం న్యూక్లియన్ 26 కి సమానంగా ఉండేది. అయితే తాజాగా కనుగొన్న ఆక్సిజన్ 28లో ప్రోటాన్ 8, న్యూట్రాండ్ 20 ఉన్నాయ్ అంటున్నారు. సాధారణంగా భూమిపై ఉండే మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ శాతం ఆక్సిజన్ 16 రూపంలో మాత్రమే ఉంటుంది.