Pawan Kalyan – Mahesh Babu : తెలుగు చిత్ర సినిమా ఒక రంగుల ప్రపంచం. దాంట్లో ప్రేక్షకుల నాడీ పట్టుకొని విజయం సాధించాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ కొత్త ,కొత్త ప్రయోగాలు సృష్టిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ ట్రెండులో భాగమే ఈ క్యామియో సిస్టం. అసలు ఈ కామియో సిస్టం అంటే ఏమిటి..? దాని వల్ల చిత్ర యూనిట్ కి ఎటువంటి లాభాలు ఉన్నాయి. ప్రేక్షకులకు ఎటువంటి వినోదం అందుతుంది. తెలుసుకుందాం..
మనకు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయి కోట్లల్లో వసూలు చేసిన రజనీకాంత్ జైలర్ సినిమా లో మోహన్ లాల్ శివన్న పాత్రలో క్యామియోలో నటించాడు. ఆ సినిమాకి శివన్న పాత్ర ఎంత ప్లస్ పాయింట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిరంజీవి పక్కన రవితేజ క్యామియోగా చేశారు. ఆ తర్వాత కథ డిమాండ్ చేయడంతో కీలకపాత్రగా అది మారిపోవడం కూడా జరిగింది.
అయితే ఈ క్యామియో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అన్నది చాలా మందికి తెలియదు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. చాలామంది సినిమాపై హైప్ పెంచడం కోసం ఇలా చేస్తారని అనుకుంటారు.. కానీ ముఖ్య రీసన్ ఇద్దరు హీరోల అభిమానుల నుండి ఆ సినిమాకు సపోర్ట్ లభిస్తుంది. అయితే ఈ వరుస క్యామియోలు రాజ్యా మేలుతున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు మరో క్యామియో మన ముందుకు రాబోతుంది. అది ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్ హీరోలు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. వినడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా.
పవన్ కళ్యాణ్ తాజాగా షూటింగ్ లో పాల్గొంటున్నటువంటి సినిమా OG. దీనిని నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఈ OG సినిమాలో మహేష్ బాబు కూడా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ లో కనిపించబోతున్నారని వినికిడి. మహేష్ బాబు ఓ జి సినిమాలో కొన్ని నిమిషాల పాటు గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తూన్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాలో హిందీ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తుండగా, హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఇంకా హైప్ పెంచడం కోసం ఇప్పుడు ఈ కామియో సిస్టంని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టుగా సినీవర్గాల సమాచారం. మహేష్ బాబు ఈ సినిమాలో క్యామీయోగా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు పండగే.. పండుగ.. అని చెప్పవచ్చు.