Plastic Currency : కేంద్ర ప్రభుత్వం ఇది వరకే 500,1000 రూపాయల నోట్లను రద్దు చేసి ప్రజలను గందరగోళ పరిస్థితులలోకీ నెట్టివేసింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో 2000 రూపాయల నోట్లను రద్దు చేసి మరోమారు కలకలం సృష్టించింది. అయితే 2000 రూపాయల నోటును మార్చుకోవడానికి కొన్ని సదుపాయాలను కల్పిస్తూ, మరికొన్ని ఊహాగానాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆజ్యం పోస్తుంది.
ఇండియాలో పేపర్ కరెన్సీని పూర్తిగా నిలిపివేస్తుందని అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ వినియోగంలో ఉంది. రాబోయే కాలంలో ఇండియాలో కూడా ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులోకి రానుంది అనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 2000 నోట్ల చలామణి నిలిపి వేయడంతో ఆర్.బి.ఐ ఈ వీటిని వెనక్కి తీసుకుంటుంది. సెప్టెంబర్ 30లోగా బ్యాంకులలో వీటిని డిపాజిట్ చేయాలని ఆర్.బి.ఐ తెలిపింది. ఈ పేపర్ నోట్ల సమయం ముగియడంతోనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. దీనివల్ల ఇండియాలో ఇంకొన్ని రోజుల్లోనే ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పటికే 23 దేశాలలో ఈ ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలో ఉంది. అయితే ఆ 23 దేశాల్లో ఆరు దేశాలు పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీనే వినియోగిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, బ్రూనై,ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, రుమానియా, వియత్నాం ఉన్నాయి. నకిలీ నోట్లను తయారు చేసే ముఠాలు ఇప్పుడు మార్కెట్లో కోకోల్లలు.
వారి ఆగడాలను అడ్డుకునేందుకు ఈ ప్లాస్టిక్ కరెన్సీ చాలా ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ కరెన్సీని కాపీ చేయడం అంత సులువైన పని కాదు. అది చాలా కష్టంతో కూడుకున్నది. ఈ ప్లాస్టిక్ కరెన్సీ వల్ల ఇంకో ఉపయోగం ఏమిటంటే తేమ, ధూళి సమస్యలు వీటికి ఉండవు. పేపర్ నోట్ల కంటే ప్లాస్టిక్ కరెన్సీ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.