Prabhas – Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ ని చేజిక్కిచ్చుకుందాని తెలుస్తుంది. యూట్యూబర్ గా మొదలైన వైష్ణవి ఇప్పుడు బేబీ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి ఊహించని ఆఫర్లను పొందుతుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ సినిమాతో ఇండస్ట్రలోకి అడుగు పెట్టిన వైష్ణవి చైతన్య మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని తన సొంతం చేసుకోగా..ఆ తర్వాత సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుంది.
అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ తో ఇప్పటికే ఓ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అలాగే డబ్బులు ఇస్మార్ట్ లో కూడా సెకండ్ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య ను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ కోవలోనే ఒక జాక్పాట్ ఆఫర్ తో వార్తలలో నిలిచింది వైష్ణవి. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ యొక్క చెల్లెలు పాత్రకు వైష్ణవి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఇది ఫైనల్ కి వచ్చినట్టు సినీ వర్గాల సమాచారం. సందీప్ రెడ్డి వంగ ఈ పాత్ర గురించి వైష్ణవిని కలిసినప్పుడు ఆమె వెంటనే ఓకే చేసింది అంట.
అలాగే ప్రభాస్ కూడా వైష్ణవి నీ ఓకే అంటూ యాక్సెప్ట్ చేశాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఓ సినిమా తెలుగు తెరకెక్కుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో సిద్దుకు జోడిగా వైష్ణవి నటిస్తుందని వార్త ఇప్పుడు హల్చల్ గా నిలుస్తుంది. తెలంగాణ యాసను ఇద్దరు పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతారు. ఆ ఇద్దరి యాసాతో ఆ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని మంచి ఎంటర్టైన్ మూవీ గా ఫుల్ మాస్ యాంగిల్ లో ఉంటుందని కూడా సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. పైన చెప్పిన ఆఫర్లు కూడా నిజంగా నిజమైనట్టయితే వైష్ణవి కెరియర్ మరో లెవల్ లో ఉంటుంది.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.