Sai Pallavi : దక్షిణాదిన తనకంటూ ఒక సొంత స్టార్ డామ్ నీ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయింది. ఆమె ఒక్కో సినిమాను ఎంతో ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆమె ఏదైనా ఈవెంట్ కి వస్తున్నారన్న, సినిమా ప్రమోషన్ కి వస్తున్నారా.. కూడా ఫాన్స్ పండగ చేసేసుకుంటారు అంతలా సాయి పల్లవికి ఫ్యాన్సు ఉన్నారంటే కేవలం ఆమె అది సహజ నటనకు ప్రతీక. అయితే ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది సాయి పల్లవి.
గార్గి సినిమా తర్వాత ఆమె ఎటువంటి సినిమాకి సైన్ చేయలేదని తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఆమె నార్త్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుందని ఒక వార్త హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సినిమాలో సాయి పల్లవి ఒక మెయిన్ రోల్ కోసం సెలెక్ట్ చేశారని దానికోసం సంప్రదింపులు చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. జునైద్ ఖాన్ సినిమా ప్రేమ కథకు సంబంధించిన సినిమా అని తెలుస్తుంది.
జునైద్ ఖాన్ YRF సంస్థ ద్వారా సినీ అరంగేట్రం చేస్తున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే సాయి పల్లవి జునై తో కలిసి లవ్ స్టోరీ లో నటించబోతుందని ఒక వార్త ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. తను ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే సాయి పల్లవి ఈ సినిమాకి ఒప్పుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ అనగానే ఆమె అభిమానుల్లో ఒక హైప్ క్రియేట్ అయింది. తను అక్కడ కూడా మంచి నటనతో మార్కులు కొట్టేసి సక్సెస్ దిశగా వెళుతుంది అని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.