Salaar Teaser : రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. యశ్‌ను రాఖీ భాయ్ అనే పవర్ ఫుల్ రోల్ చూపించిన ప్రశాంత్ నీల్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలని ఎంతోకాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్. గురువారం తెల్లవారుజామున ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్ పార్క్ లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో…’ అంటూ టీనూ ఆనంద్ డైలాగ్ తో మొదలైన టీజర్ చూస్తుంటే.. ప్రభాస్ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని మాస్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉన్నట్టు సలార్ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. సుమారు నిమిషంన్నర పాటు కట్ చేసిన ఈ క్రేజీ టీజర్ స్టన్నింగ్ విజువల్స్ తో బిగ్ స్క్రీన్స్ పై ఓ భారీ యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.
బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను మించిపోయేలా సలార్‌ను ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ అంతటా కనిపించింది. రెండు పార్టులుగా సినిమా విడుదల కానుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. టీజర్ ఎండింగులో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా చూపించారు. సలార్ ఫస్ట్ పార్టీ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.