Samantha : సమంత ఈ పేరు ఎప్పుడు ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియా వార్తలల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త వార్తతో ట్రెండును సృష్టించింది సమంత. సమంత నటిస్తున్నటువంటి ఖుషి సినిమా ఈనెల సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో సమంత వేసుకున్న డ్రస్సు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ డ్రెస్ ఖరీదు చూసి ఒక్కొక్కరు నోర్లు వెల్లబెడుతున్నారు.
మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె అమెరికా పర్యటనలో ఉంది. న్యూయార్క్ లో జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొని అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ఎప్పటికప్పుడు తన అప్డేట్ ని షేర్ చేసుకునే సమంత అభిమానుల కోసం కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఫోజులతో అభిమానుల సందడి చేసింది. ఈ ఫోటోలో సమంత వేసుకున్న డ్రెస్ గురించే ఇప్పుడు చర్చ అంతా.. ఆ డ్రెస్ కు ఒక ప్రత్యేకత ఉంది.
ఈ అందమైన డ్రస్సును డిజైన్ చేసింది ప్రముఖ సెలెబ్రెటీ డిజైనర్ అయినటువంటి అనిత డోంగ్లి. ఈ డ్రెస్ యొక్క ధర అక్షరాల 2 లక్షల 25 వేల రూపాయలు. అంత ధర ఉన్నటువంటి డ్రెస్సును వేసుకున్న సమంతను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ సైతం షాక్ అవుతూ.. సమంత ఆ డ్రెస్ లో అందంగా,స్టైలిష్ గా ఉందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.