Sobitha Dulipala : నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి వారిద్దరి విషయంతో పాటు శోభిత ధూళిపాల కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో ఉంటుంది. నాగచైతన్య, సమంత విడాకులకు ప్రధాన కారణం శోభిత అనే అప్పుడు ఒక న్యూస్ వైరల్ అయింది. శోభిత కోసమే సమంతాను వదులుకున్నాడంటూ ఒక వార్త తెగ చెక్కర్లు కొట్టింది. దానిని శోభిత ఖండిస్తూ వచ్చినప్పటికీ నాగచైతన్య ఎక్కడ కూడా ఖండించలేదు.
అలా ప్రతిసారి నాగచైతన్య, శోభిత గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య కి ఒక బిజినెస్ మాన్ కూతురితో పెళ్లి ఫిక్స్ చేశాడు అనే వార్త నిన్నటి నుంచి తెగ హల్చల్ చేస్తుంది. దాంట్లో భాగంగానే శోభిత, నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరో వార్త హల్చల్ చేస్తుంది. ఈ విషయంలో నాగార్జునకి నాగచైతన్యకి మధ్య కోల్డ్ వారు జరుగుతున్నట్లుగా కూడా చెప్తున్నారు.
దీనిలో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ శోభిత మాత్రం ఈ న్యూస్ పైన స్పందించింది. అనవసరమైన విషయాలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ, ఫేక్ న్యూస్ లను రాస్తున్నారు. అలాంటి న్యూస్ లను నేను పట్టించుకోను. వాటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఏమీ లేదు అంది. నా లైఫ్ కి సంబంధించి ఏదైనా నిర్ణయం ఉంటే నేనే ఓపెన్ గా చెప్పేస్తాను. కానీ ఇలా రాయడం కరెక్ట్ కాదు. నేను వాటికోసం ఆలోచించి, బాధపడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అని కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది ఈ అమ్మడు.