Srileela : శ్రీలీల అతి తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అగ్ర హీరోలతో సినిమా చాన్సులు కొట్టేస్తూ.. చాలా బిజీ బిజీగా ఉంది. అయితే శ్రీలీల మొదటిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినటువంటి పెళ్లి సందడి సినిమా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే కన్నడ ఇండస్ట్రీలో పని చేసి తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో నటించడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
శ్రీలీల చేతిలో ఇప్పుడు పది సినిమాలకు పైగా ఉన్నాయి. అని అంటే ఆచ్ఛార్య పోవాల్సిందే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరుకారం లో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాలో ముందుగా పూజ హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ తర్వాత ఆమె ప్లేస్ లో శ్రీలీలను ఖరార్ చేసేసారు. ఈ షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో నిల్వనుంది.
ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవత్ కేసరిలో కూడా శ్రీలీల నటిస్తుంది. అలాగే రామ్ పోతినేని హీరోగా చేసిన స్కంద, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. ఇవన్నీ ఇలా ఉండగా మాస్ మహారాజా ధమాకా సినిమాలో రవితేజకు పోటీ పడుతూ తన ఎనర్జీతో కట్టిపడేసిన శ్రీలీల మళ్లీ రవితేజతో నటించడానికి సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రాబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుందని, అలాగే శృతిహాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషిస్తుందని వినికిడి.