TDP Junior NTR Craze : టిడిపి నేత చంద్రబాబు అరెస్టు విషయం మనకు తెలిసిందే. చంద్రబాబు అరెస్టు విషయం గురించి ఎన్టీఆర్ ఇప్పటివరకు ఏ విధమైన స్పందన ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో వైరల్ అయింది. ఎన్టీఆర్ స్పందించకపోవడంతో సర్వత్ర ఈ విషయము ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. బాలయ్య ఎన్టీఆర్ గురించి ప్రెస్ మీట్ లో పెడుతూ దాంట్లో ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఐ డోంట్ కేర్ అంటూ ఆయన వాయిస్ ని వినిపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం గురించే అంటున్నారని అర్థమయిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బాలయ్య బాబును ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మీ కుటుంబానికి ఎంత చేసిన మీరు దానిని గుర్తించరు. పైగా ఆయన్ని నిందిస్తూ ఉంటారు, అని ఫ్యాన్స్ బాలయ్య పై బాగానే ఫైర్ అయ్యారు.
ఇంతకుముందు ఎన్టీఆర్ కి జరిగిన అవమానాలు ఇప్పుడు ఆయన చంద్రబాబు అరెస్టు గురించి స్పందించకపోవడానికి ముఖ్యమైన కారణాలు అని ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ కి మేమందరము అండగా ఉంటాము. ఆయనది మంచి మనసు. అది గుర్తించకపోవడం మీ తప్పు అని బాలయ్యను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తూ ఎన్టీఆర్ కీ సపోర్టుగా ఫ్యాన్స్ నిలబడుతున్నారు.
అయితే బాలయ్య ప్రెస్ మీట్ లు పెడుతూ మాట్లాడుతున్న టైం లో అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్థం కావట్లేదని, దానివల్ల టిడిపికి చాలా నష్టం జరుగుతుందని మరోపక్క చాలామంది అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఒక మాట అన్నా కూడా మేము ఊరుకోమని టిడిపి సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటామని డైరెక్ట్ గానే ప్రకటించేస్తున్నారు. బాలయ్య మాట వల్ల టిడిపికి నష్టమే జరిగేలాగా ఉంది. దీనిని ఇప్పటికైనా గుర్తించకపోతే విషయం చేయి దాటిపోతుంది.