Uk River : నదిలో నీరు అకస్మాత్తుగా ఎప్పుడైనా రంగులు మారడం మీరు చూశారా.. అలా నీరు రంగు మారడం అనేది జరగదు. నీళ్లు ఎప్పుడూ ఒకే రంగులో ఉంటుంది అంటారు కదా.. కానీ ఈ విచిత్రం ఒకచోట చోటు చేసుకుంది. అక్కడ నదిలోని నీళ్లు అకస్మాత్తుగా రెండు రంగుల్లోకి మారాయి.అలా మారి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశాయి. ఆ నది ఎక్కడ ఉంది ఆ నీరు అలా మారడానికి గల కారణాలు తెలుసుకుందాం..
ఇప్పటివరకు మనం మాట్లాడకుండా విచిత్రం అంతా యూకే లో జరిగింది. బిట్రన్‌లోని స్టఫోర్డ్‌షైర్‌లోని ట్రెంట్ నదిలోని కొంతభాగం నీలం, మరికొంత భాగం నారింజ రంగులోకి మారింది. ఈ వార్త ఆ నోట ఈ నోట, సోషల్ మీడియా ద్వారా బ్రిటన్ మొత్తం పాకిపోయింది. ఇప్పుడు అక్కడ ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నదిలో నీరు అలా మారడంతో అందులోని జలచరజీవులన్నీ ఏమయ్యాయో అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం వెంటనే నదిలో నీళ్లు అలా మారడానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బట్టల రంగులు అనుకోకుండా ఆ నదిలో పడిపోవడంతో నీళ్లు అలా మార్పు చెందాయని దానికి అంతకుమించిన కారణం ఏమి లేదని స్పష్టం చేసారు. ఈ రంగుల వల్ల నదిలోని చేపలు ,ఇతర జలా చరాలకు ఎటువంటి ఇబ్బంది కలగదని వారు స్పష్టం చేశారు.
నదిలో నీళ్లు అలా మార్పు చెందగానే అందరూ ఆందోళన వ్యక్తం చేసిన నేపద్యంలో అసలు విషయం తెలుసుకొని కాస్త ఊపిరి పీల్చుచుకున్నారు. ఆ నది చుట్టుపక్కల ప్రాంతం ఎప్పుడూ కూడా పర్యాటకులతో నిండి ఉంటుంది. ఒకేసారి నది ఇలా మార్పు చెందగానే అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. దీని వేనుక వాతావరణ కాలుష్యం ఉందేమో అని అందరూ ఆందోళన చెందారు.
అయినప్పటికీ రంగుల వల్లనే నది ఇలా జరిగిందా అని సరైన సమాచారం లేకపోవడంతో నది మీద సమగ్ర పరిశోధన జరిపి ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ దగ్గరుండి దీనిపై ఎక్వైయిరీ చేయాలని, అసలు విషయాలు వెల్లడించాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.