Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ఒక ఇంటి వారు కాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జూన్ 9వ తేదీన నాగబాబు నివాసంలోనే చాలా ధూమ్ ధామ్ గా జరిగింది. అప్పటినుంచి ఈ జంట వార్తల్లో హాట్ టాపిక్ గానే ఉంటున్నారు. వీరిద్దరి పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అభిమానులందరికీ ఈ జంట ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని శుభవార్త చెప్పారు.
పెళ్లికి కావలసిన షాపింగ్ కూడా వీళ్లు మొదలు పెట్టేశారు. రీసెంట్ గా షాపింగ్ కి సంబంధించిన వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అయిపోయాయి. గత కొద్ది కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కానీ దాన్ని వీరిద్దరూ కొట్టి పారేస్తూ వచ్చారు. చివరికి ఇద్దరు ప్రేమించుకున్నట్టు తెలిపి ఎంగేజ్మెంట్ ని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. పెళ్లికి మాత్రం కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు.
ఇప్పుడు నవంబర్ ఒకటో తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటలీలో వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే షాపింగ్ తో బిజీబిజీగా ఉన్నరు ఈ జంట. ఆ వీడియోలో చాలా హ్యాండ్సమ్ గా వరుణ్ తేజ్ కనిపిస్తుండగా.. చాలా బ్యూటీతో మెరిసిపోతూ లావణ్య త్రిపాఠి చాలా ట్రెండీ లుక్ తో కనిపిస్తుంది. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన షాపింగ్ వీడియోలు వీళ్లిద్దరూ కలిసి హ్యాపీగా తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.