Vijay Devarakonda : టాలీవుడ్ లో రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఖుషి సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ హీరో లైగర్ తో అపజయాన్ని తన ఖాతాలో వేసుకుని, ఖుషి సక్సెస్ తో మళ్ళీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ హీరో ఇప్పుడు తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల 69వ జాతీయ అవార్డుల ప్రకటన మనకు తెలిసిందే తెలుగు చిత్రాసీమను చాలా అవార్డులు వరించాయి. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి గర్వించదగ్గ విషయంగా అందరూ అభివర్ణించారు.
ఈ అవార్డులకు సంబంధించి ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేషనల్ అవార్డ్స్ లో మైత్రి మూవీ మేకర్స్ వారి ఆధ్వర్యంలో వచ్చిన ఉప్పెన సినిమా ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా, అలాగే మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమా గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డులు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మన రౌడీ విజయ్ మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలోనే ఖుషి సినిమాలో నటించారు.
ఈ సినిమా చాలా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతరలలో ఒకరైన రవిశంకర్ తో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా ప్రశ్నలకు ఆన్సర్ చేశారు. దాంట్లో భాగంగానే విజయ్ దేవరకొండ జాతీయ అవార్డుల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు పుష్ప సినిమా గాను ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది, అలాగే ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ గారి కూడా అవార్డు వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉండేదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త నెట్ ఇంట్లో వైరల్ అయిపోయింది.