White crow : మనకు తెలిసినంతవరకు కాకులు నలుపు రంగులోనే ఉంటాయి. కదా.. కానీ తెలుపు రంగు కాకులు కూడా ఉంటాయని చాలామందికి తెలియదు. ఈ ప్రకృతిలో తెలుపు రంగు కాకులు ఉన్నాయి. ఇవి చాలా అరుదుగా కనిపించే కాకులు. ఇవి కనిపిస్తే ఏదో ఒక అశుభం జరుగుతుందని భారత దేశంలో నమ్ముతారు. అయితే ఈ తెల్లరంగు కాకి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటారా..?
ఈ మధ్య కాలంలో తమిళనాడు ట్యూటికోరిన్లోని కోవిల్పట్టి ప్రాంత వీధుల్లో ఒక అరుదైన అల్బినో కాకి కనిపించింది. ఆ కాకి తెలుపురంగులో ఉంటుంది. ఈ వార్త డాక్టర్ల వరకు వెళ్లాక వారు దీని గురించి వివరణ ఇచ్చారు.. సాధారణంగా కాకి పునరుత్పత్తిలో ప్రతి 30 వేల పక్షులకు ఒకసారి అల్బినోలు సంభవిస్తాయి.
జన్యు పరివర్తనను కలిగి ఉన్న తెల్లటిరంగు కాకి పూర్తిగా రంగు మారక పోవటంతో ఇలా సంభవిస్తూ ఉంటాయంట. ఈ రకమైన కాకి చర్మం లేదా జుట్టులో మెరైన్లు వర్ణ ద్రవం లేకపోవడం వల్ల అవి ఇలా తెల్లగా కనిపిస్తాయని పరివర్తన లేకపోవడం వల్ల కాకి పూర్తిగా తన రంగులోకి మారకపోవడమే దీనికి కారణమని వారు వెల్లడించారు. ఈ తెల్ల జాతి కాకులు ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం..
ఇవి ఎక్కువ కాలము జీవించలేవు. కాబట్టి వాటి జన్యులను తర్వాతి తరానికి అందించలేవు. సాదరణంగా ఈ ఆర్బినో కాకుల పాదాలు గులాబీ రంగులో ఉంటాయి. వాటికి దృష్టిలోపం కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ తెలుగురంగు కాకి కనిపించడం పట్ల..పుదుకోట్టై జ్యోతిష్యుడు శ్రీ సౌమా స్పందిస్తూ.. కాకులు ఆధ్యాత్మిక పక్షులు. ఇవి జ్యోతిష్యంతో అనుసంధానించబడినవి.
కాకులకు శని గ్రహంగా, మన పూర్వీకుల రూపంగా కూడా భావిస్తూ ఉంటారు. కాకుల రూపంలో మన పూర్వీకులు ప్రతిరోజు మనకు దర్శనమిస్తుంటారని, వాటికి ఆహారం పెడితే మన పూర్వీకులు వాటి రూపంలో వచ్చి తిని మనల్ని ఆశీర్వదిస్తారని శాస్త్రాల్లో ఉందని ఆయన వెల్లడించారు. అలాగే ఖురాన్, బైబిల్ లో కూడా కాకుల గురించి చాలా ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే తెల్లకాకులు కనిపించడం దేశానికి అపశకునంగా భావిస్తున్నారు. చైనా లేదా పాకిస్తాన్ దేశాల నుండి ముప్పు పొంచి ఉందని జ్యోతిష్యుడు హెచ్చరిస్తున్నారు. ఇదివరకు తమిళనాడులో తెల్లకాకి దర్శనమిచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వము మారింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో తెల్లకాకి దర్శనం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.