Deepika Padukone Net Worth : ఆన్ స్క్రీన్‌లో ఆమె అందం, ఆఫ్ స్క్రీన్‌లో ఆమె వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది దీపికా పదుకొనె. అందుకే.. దశాబ్దకాలం నుంచీ బాలీవుడ్‌ను ఏలేస్తుంది. 2007లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది దీపిక. ఆ మూవీ హిట్ కావడంతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకెళ్తోంది. దక్షిణాదికి చెందిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్టార్టింగ్ నుంచి బాలీవుడ్‌పైనే ఫోకస్ చేస్తూ వస్తుంది. ఇప్పుడిప్పుడే దక్షిణాదిన మరీ ముఖ్యంగా తెలుగు పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ Kలో నటిస్తోంది.

బాలీవుడ్లో ఇంత క్రేజ్ సంపాదించుకోవటానికి దీపికా పదుకొనె చాలానే కష్టపడింది. ఒక్క క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆమె ఏడాదికి ఎంత సంపాదిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ బిజినెస్ వర్గాలు కూడా ఈ విషయం మీద ఫోకస్ చేసి ఏడాదికి 40 కోట్లు సంపాదిస్తుంది తేల్చాయి. ఇప్పటి వరకు ఆమె ఆస్థులు విలువ 60 మిలియన్ డాలర్స్.. అంటే దాదాపు రూ.500 కోట్లు. అగ్ర హీరోలకు ధీటుగా ఈ బ్యూటీ డాల్ సంపాదన ఉందని సమాచారం.
Samantha Old Tweet : సామ్ కి తలనొప్పిగా మారిన ఓల్డ్ ట్వీట్.. అప్పుడలా.. ఇప్పుడిలా..
ఒక్కో సినిమాకు ఆమె రూ.15 కోట్లు మేరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక ప్రాజెక్ట్ K సినిమాకైతే ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఇక కమర్షియల్ యాడ్స్ చేయటానికి రూ. 7-10 కోట్లు వసూలు చేస్తుంది. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలంటే రూ.1.5 కోట్లు ఇవ్వాలిసిందే.. కొలీగ్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూ, హాలీవుడ్ స్థాయిలో స్పెషల్ అకేషన్స్ కి హాజరవుతూ ఆల్ ఇన్ ఒన్ అనే పేరు సంపాదించుకుంది దీపిక.
Urvashi Rautela Hot Pics : బ్రో బ్యూటీ హాట్ పిక్స్.