Naga Babu : ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సెలబ్రెటీ జంట విడిపోయింది. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య. ఎప్పటినుంచో జనాలు ఊహిస్తున్నదే కానీ దానికి తెరదించడానికి విడాకులు నిజంగానే తీసుకోబోతున్నాం అంటూ అఫీషియల్ ప్రకటన చేసేసింది. మనస్పర్థల కారణంగా వీరిద్దరు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసినట్లు సమాచారం. గత నెలలోనే వీరికి కోర్టు విడాకులకు మంజూరు చేసింది.
కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిహారిక విడాకుల విషయాన్ని కొంతమంది అభిమానులు ఏకీభవిస్తే మరి కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కలిసి ఉండడం కుదరనప్పుడు విడిపోయి వేరుగా బతకడమే మంచిది అంటున్నారు ఇంకొందరు. ఇదిలా ఉండగా నిహారిక డివోర్స్ వల్ల నాగబాబు కుటుంబానికి ఎంత నష్టం వచ్చిందనే దానిపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
నిహారిక వివాహాన్ని గ్రాండ్ గా రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో చేశాడు నాగబాబు. ఇక వీరి పెళ్లికి వేదికగా మారిన ఆ ప్యాలెస్ ఒక రోజు రెంటే రెండు కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. వీరి పెళ్లి కోసం నాగబాబు దాదాపు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. ఇక నిహారిక భరణం కింద రూ.100 కోట్ల వరకు తీసుకుంటుంది అని పుకార్లు వచ్చినప్పటికీ.. నిహారిక తన భర్త నుంచి భరణంగా ఒక్క రూపాయి కూడా వద్దని తెగేసి కోర్టులో చెప్పిందట.