Aus vs Ind Women : మహిళల టీ20 WC సెమీస్ లో భారత్ ఓటమిపాలైంది. మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. యంగ్ ప్లేయర్ షఫాలీ, స్మృతి, యస్తికా విఫలమైనా.. జెమీమా 43, హర్మన్ ప్రీత్ 52 తో పోరాడారు.
అయితే హర్మన్ ప్రీత్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఈ రనౌట్ ను వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్ తో పోల్చుతూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇద్దరి జెర్సీ నెం.7 అని.. ధోనీ కూడా సెమీస్ మ్యాచ్ రనౌట్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు.