Paid Marriage Leaves : జనాభా పెరుగుదల కోసం దేనికైనా సై అంటున్న చైనా… పెళ్ళైన కొత్త జంటలకి తీపికబురు..
దేశంలో జనాభా పెరుగుదలకి చైనా నానాతంటాలు పడుతుంది.ఇదివరకే కుటుంభ నియంత్రణ చట్టం ఎత్తివేసి..ముగ్గురు లేదా ఆ పైన ఎంతమంది సంతానాన్ని అయినా కనేవారికి భారీ నజరానా కూడా ప్రకటించింది… అయినా కూడా పెద్దగా ప్రయోజనం కనబడకపోవడంతో మరో ఆలోచన చేసింది చైనా.. అదేంటంటే..??

కొత్తగా పెళ్లిచేసుకున్న జంటలకి..జాబ్ ఏదైనా కానీ ఒక నెలరోజులతో పాటు శాలరీ తో కూడిన సెలవులు ప్రకటించింది.ఇలా అయినా జనాభా పెరుగుదలకి అవకాశం ఉందని భావిస్తుంది.
ఇప్పటికే ఉన్న జనాభాలో అధిక శాతం వృద్ధులు ఉండడంతో, రానున్న కాలంలో పారిశ్రామిక రంగాల అభివృద్ధి,ఆర్థికాభివృద్ధితో పాటు మిగతా రంగాల్లో ఎదుగుదల అనేది కష్టం అవుతుందని.. తద్వారా భవిష్యత్ లో కష్టాలు తప్పవని ఆలోచించిన చైనా, జనాభా పెరుగుదలకి చేతనైనంత మేరకు కొత్త కొత్త ఉపశమనాలు మాత్రమే కాకుండా ఒకడుగు ముందుకు వేసి ప్రజలకి ఆర్థికంగా భరోసా ఇచ్చి కూడా ఆదుకునేందుకు మేమున్నాం అని కూడా నమ్మకం కలిగిస్తుంది …

ఇలా జనాభా పెరుగుదలకి తాము అనుకున్న సత్ఫలితాలు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది డ్రాగన్ దేశం.చూడాలి మరి భవిష్యత్ పట్ల ఆందోళన చెందుతున్న డ్రాగన్ ప్రభుత్వాన్ని ఈ సరికొత్త ఆలోచన అయినా గట్టెక్కిస్తుందో లేదో మరి.
