TSSPDCL Artisans :ఎవరికీ పట్టని ఆర్టిజన్ గోడు.. విధ్యుత్ శాఖలో అమలు కాని సియం హామీ
తెలంగాణా వచ్చాక విధ్యుత్ రంగంలో విప్లవం తీసుకొచ్చాం, రైతులకి 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణా ఒక్కటే అని , ఇలా ప్రతీ సందర్భంలో ప్రధానంగా విధ్యుత్ విషయంలో తెలంగాణా రాష్ట్ర సాధన వల్లే ఈ ఘనత అంటూ ముఖ్యమంత్రి కేసీయార్ చెప్తున్న మాటలివి… కానీ ఆ ఘనత వెనుక ఉన్న విధ్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్ లు గా పనిచేస్తున్న కింది స్థాయి కార్మికుల తలరాత మాత్రం మారలేదు… తెలంగాణా వస్తే పర్మినెంట్ అవుతాం అని అనుకున్న వారి ఆశలు ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరక చాలీ చాలని జీతాలతో అర్దాకలితో అలమటిస్తున్నారు… పైగా నిరంతరం నాణ్యమైన విధ్యుత్ సరఫరాలో వీరిదే కీలక పాత్ర కావడం గమనార్హం
తెలంగాణా వచ్చాక 2014లో జరిగిన మొదటి సార్వత్రిక జరిగిన మొదటి ఎన్నికల ప్రచారంలో విధ్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఉద్దేశించి “కాంట్రాక్ట్ వ్యవస్థ నే లేకుండా చేస్తాం.. పనిలేని ఈ దిక్కుమాలిన కాంట్రాక్ట్ వ్యవస్థని ఏకంగా రద్దు చేస్తాం అని.. టీయారెస్ ని గెలిపిస్తే ఇక అర్దాకలితో ఏ కార్మిక కుటుంభం ఉండదని” కేసీయార్ అన్న మాటలివి.ఆ తరువాత అసెంబ్లీలో పలుమార్లు చెప్పినా కూడా విధ్యుత్ శాఖ లోని కాంట్రాక్ట్ కార్మికుల పేరు ఆర్టిజన్ ల గా మారిందే తప్ప పూర్తిస్తాయి లో రెగ్యులర్ అయితే కాలేదు.పేస్కేలు, prc వంటి బెనిఫిట్ లు ఏవీ అమలు కాలేదని ఆవేదన చెందుతున్నారు.1959 నాటి నుండి విధ్యుత్ కంపెనీల్లో కొనసాగుతున్న APSEB రూల్స్ ఆర్టిజన్ ల కి వర్తిచట్లేదు. దీనితో తామెలా రెగ్యులర్ అయినట్టు ప్రశ్నిస్తున్నారు.
గతంలో 2013లో హైదరాబాద్ విధ్యుత్ ప్రధాన కార్యాలయం అయిన మింట్ కాంపౌండ్ లో ఉద్యమ నేత హోదాలో కేసీయార్ మాట్లాడుతూ ఒక్క సంతకంతో విధ్యుత్ రంగంలో ఉన్న దాదాపు 23 వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తున్నారు ఆర్టిజన్ లు.”రాష్ట్రం వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు అవుతుందని మీరు ముఖ్యమంత్రి అయ్యారని, కొడుకు మంత్రి అయ్యాడని, కూతురు ఎంపీ అయిందని అలాగే అల్లుడు కూడా మంత్రి అయ్యాడని,మమల్ని అయితే రెగ్యులర్ చేశామనే సాకుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా పూర్తిస్థాయిలో రెగ్యులర్ చేయాలని, అలాగే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి మాదిరే తమకు కూడా ఒకే రూల్ వర్తింపజేయాలనీ, మెడికల్ సదుపాయాలు కూడా అపరిమితం గా కల్పించాలని కోరుతున్నారు.ఇటీవలే తమ డిమాండ్లు త్వరగా నెరవేర్చాలని కోరుతూ లంచ్ అవర్ లో విడతల వారీగా నిరసనలు తెలుపుతున్న కార్మికులు, H-82 అనే యూనియన్ తరపున త్వరలోనే తమ ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు .