PM Kissan Samman Nidhi:నేడే రైతుల అకౌంట్లోకి డబ్బులు…..కానీ ఇలా చేసినవారికే
రైతులకి శుభవార్త.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం “పియం కిసాన్ సమ్మాన్ నిధి.”దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి ఈ పథకం ద్వారా ఏటా బ్యాంకు ల ద్వారా వారి అకౌంట్ల లోకి నగదు జమజేస్తుంది.అయితే అందులో భాగంగా తాజాగా పియం కిసాన్ సమ్మాన్ నిధి కింద 13 వ విడత డబ్బులని ఈరోజు దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల కోసం విడుదల జేయనుంది.
ఇవాళ నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన లో అక్కడినుండే ఈ నిధులని విడుదల చేస్తారు.దాదాపుగా ఈ పథకం కింద ఈరోజు 16,800 కోట్లు విడుదల చేయనున్నారు. అయితే ఇక్కడ రైతులు తమ బ్యాంకు అకౌంట్ కి సంభందించి e-kyc పూర్తి చేసి ఉండాలి. అలా చేయించుకోని రైతులకి ఈ పథకం వర్తించదు, వారి అకౌంట్లో డబ్బులు జమకావు