Love Failure’s :విషాదం… నల్గొండలో ప్రేమజంట ఆత్మహత్య
“ఆత్మహత్య”..
ఒకప్పుడు పాతకాలంలో ఈ పదం పెద్దగా ఎవరూ వినలేదు.. కానీ ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఈ మాటే వినిపిస్తుంది. పైగా చిన్న చిన్న కారణాలకే. ఒకరు ఫోన్ కొనివ్వలేదని, ఇంకొకరు నచ్చిన బైక్ కొనివ్వలేదని, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ఆఖరికి ఫేస్ బుక్ లో లైక్ లు రాలేదని కూడా ఆత్మహత్య లు చేసుకుంటున్నారు నేటి జనాలు.అవసరం లేని
చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో తమ నిండు జీవితాలని ఆత్మహత్య ల రూపంలో ముగిస్తూ తల్లిదండ్రులకి కడుపు కోతకి గురి చేస్తున్నారు.
ఇలా చిన్న చిన్న కారణాలకే
ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ప్రేమికులే అధికంగా ఉంటున్నారు ఈ మధ్య…ఒక విధంగా నిజం చెప్పాలంటే ప్రేమికుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది .
తను ప్రేమించిన అమ్మాయి నో చెప్పిందని ఒకరు, ఒకవేళ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నా కూడా ఇంట్లో ఒప్పుకోలేదు అని… ఇలా చాలా చిన్న చిన్న కారణాలతో కూడా ఏకంగా ఆత్మహత్య లాంటి పెద్ద నిర్ణయాలు అలవోకగా తీసుకొని తనువు చాలిస్తున్నారు.
తాజాగా నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి కి చెందిన రాకేష్,కొండమల్లేపల్లి మండలం దోనియాలా గ్రామానికి చెందిన అమ్మాయితో కలిసి ఈ ఉదయం నేరేడుగొమ్ము మండలం సమీపంలోని అటవీ ప్రాంతానికి బైక్ ఫై వచ్చి ఉరి వేసుకున్నారు.ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఇలా అర్దాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరం. అయితే ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఆత్మహత్య కి గల కారణాలు తెలియాల్సి ఉంది.

