Mahesh Babu Rajamouli Movie Update:అద్దిరిపోయే లెవెల్ లో పాన్ ఇండియా సినిమా…మహేష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్..??
టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. దాదాపుగా ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ మరియు టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాతలకి కనక వర్షం కురిపించే ఒక మేఘం..కేవలం టాలీవుడ్ అనే కాకుండా ఇండియన్ ప్రేక్షకులందరికీ మహేష్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉంది.అయితే తాజాగా మహేష్ సినిమా గురించి టాలీవుడ్ లో ఒక చర్చ హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఇండియన్ లెజెండరి దర్శకుడు రాజమౌళి, మహేష్ తో తెరకకెక్కించనున్న ఈ సినిమాలో మహేష్ తో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కలిసి నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంకా రాజమౌళి కానీ అటు అమీర్ గానీ ఎవరూ స్పందించట్లేదు గానీ, ఇదే నిజం అయితే మరో భారీ పాన్ ఇండియా మూవీ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. పైగా ఇది మహేష్ అభిమానులకి కూడా కిక్కెక్కించే వార్తనే మరి..