Warangal Preethi Case:ప్రీతి కుటుంభానికి ఎమ్మెల్సీ కవిత లేఖ… నిందితులని కఠినంగా శిక్షిస్తాం అని హామీ
వరంగల్ ఎంజిఎం కాలేజీలో తన సీనియర్ అయిన సైఫ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి కుటుంభ సభ్యులకి తెలంగాణా ప్రభుత్వం అండగా ఉంటుందని, దోషులని వదిలిపెట్టమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ఈ సందర్భంగా ప్రీతి మృతి మట్ల తీవ్ర విషాదంలో ఉన్న కుటుంభ సభ్యులకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు కవిత.సీనియర్ అయిన సైఫ్ వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని,ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాయని, అలా జరగడం ఇప్పటికీ జీర్ణించుకోవడం కష్టంగా ఉందని తెలిపారు.ఇలాంటి దురదృష్టకర పరిస్థితి ఏ కన్న తల్లిదండ్రులకి రాకూడనిది అన్నారు,భవిష్యత్ లో ప్రీతి కుటుంభానికి ప్రభుత్వం అలాగే BRS పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇక నిందుతులని ఇప్పటికే అరెస్ట్ చేశామని, ఖచ్చితంగా న్యాయపరంగా విచారణ జరిపి కఠినంగా శిక్షిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని లేఖలో తెలిపారు.