Dogs Crying: ఇటీవల కాలంలో కుక్కల పెంపకం బాగా పెరిగిపోయింది. కొందరైతే ఏకంగా కుక్కలను ఇంట్లోని మనిషిలా చూసుకుంటారు. వాటి పెంపకానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. కొన్ని ఫ్యామిలీలు ఎక్కడికైనా వెళ్తే తమతో పాటు వారి పెట్ డాగ్ ని కూడా తీసుకెళ్తుంటారు.
ఓ పరిశోధన ప్రకారం ఒంటరిగా ఉన్న వారు కుక్కలు పెంచుకోవడం వల్ల 15 శాతం కంటే తక్కువ మరణాలు సంభవిస్తాయని తేలింది. అయితే అప్పుడప్పుడు కుక్కలు తెగ అరవడాన్ని మీరు గమనించారా? వాటికి ఆత్మలు కనిపిస్తేనే వింతగా అరుస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఇంతకీ అస్సలు కుక్కలు ఎందుకు అరుస్తాయో తెలుసుకుందాం..

ఎప్పుడైనా కుక్కల అరుపు గమనించారా? ఆ అరుపు వింటే ఒంట్లో వణుకు పుడుతుంది కదా..!? ఒకసారి అరవడం మొదలు పెట్టిన కుక్క కొద్దిసేపటి వరకు ఆపదు. అయితే అవి అరిచే సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోయినా.. ఎవరినో చూసి అరుస్తున్నాయనిపిస్తుంది. మనకేమో ఎవరూ కనిపించరు, కుక్కలకు మాత్రం అక్కడ ఎవరో ఉన్నట్టు అరుస్తుంటాయి.
కుక్కలకు ఆత్మలు కనబడుతాయని.. అందుకే అవి అలా అరుస్తాయని కొంతమంది అంటుంటారు. ఆ సమయంలో కుక్కలు ఏడుస్తున్నట్టు వింత శబ్దాలు చేస్తాయి. అంతేకాదు ఆ ఏడుపుని అశుభంగా భావిస్తారు. కానీ కుక్కలు మాత్రం వేరే కుక్కలకు సందేశాలు ఇవ్వడం కోసమే ఈ రకమైన శబ్దాలు చేస్తాయట. వాటికి ఆత్మలు కనిపించి ఏడుస్తాయని చెప్పడం నిజం కాదని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు.
