Vegetables Storage Tips: కూరగాయలను, పండ్లను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు వాటిని మనం ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. అయితే కొన్ని రకాల కూరగాయలను, పండ్లను ఫ్రిడ్జ్ లి ఉంచడం వల్ల వాటి ఆకృతి మారడంతో పాటు త్వరగా పాడైపోతాయి అంతేకాదు కొన్ని రకాల పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉంచితే విషపూరితంగా మారే అవకాశం ఉంది. అయితే ఫ్రిజ్‌లో ఏయే కూరగాయలు, పండ్లను ఉంచకూడదో ఇప్పుడు చూద్దాం..
బంగాళదుంపలు :
బంగాళదుంపలను కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడమీ మంచిది. వాటిని గది ఉష్ణోగ్రతలో ఉంచితే సరిపోతుంది. బంగాళాదుంపలను ఫ్రిడ్జ్ లో పెడితే వాటి ఆకృతి మారిపోతుంది.
ఉల్లిపాయ :
ఉల్లిపాయలకు బాగా వెంటిలేషన్, పొడి ప్రదేశాల్లోనే ఉంచాలి. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పాడయ్యే ప్రమాదం ఉంది.
టొమాటోలు:
చల్లని ఉష్ణోగ్రత వల్ల టమోటాలు రుచి, ఆకృతిని కోల్పోయే అవకాశం ఉంది. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచే బదులు గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచడం మేలంటున్నారు నిపుణులు.
అరటిపండ్లు:
చల్లని ఉష్ణోగ్రత వల్ల అరటి తొక్కలు నల్లగా మారడంతో పాటు పుల్లగా మారుతాయి. అరటిపండ్లను ఎండకు దూరంగా నీడలో నిల్వచేయాలి.
అవోకాడో:
అవకాడోలు పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం మంచిది. అవి పండిన తర్వాత, వాటిని కొన్ని రోజులు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. కానీ పచ్చి ఆవకాయను ఫ్రిజ్‌లో ఉంచితే అది పూర్తిగా పండదు.
యాపిల్స్:
యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పండిపోతాయి. ఆపిల్ పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే, వాటిని కాగితంలో చుట్టి ఉంచండి. అంతే కాకుండా రేగు, చెర్రీ, పీచు వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
పుచ్చకాయ:
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటుంటారు. ఎప్పుడూ పుచ్చకాయను కట్ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి తినడానికి ముందు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
మామిడి:
మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. దీని వల్ల మామిడిలోని పోషకాలు కూడా నశిస్తాయి.