Jagan forgot the guarantee : ఏ రాజకీయ నాయకుడైన గెలవడం కోసం ప్రచారం సమయంలో ఎన్నో వరాల జల్లులు కురిపిస్తారు. అచ్చం అలాగే జగన్ కూడా రాజకీయ గేమ్ ని ప్లే చేశాడు. తను అధికారంలోకి రాగానే ఉద్యోగస్తుల సీపీఎస్ రద్దు చేసి మెరుగైన పిఆర్సి అందిస్తామని హామీ ఇచ్చాడు. జగన్ అంత ధీమాగా చెప్పడంతో ఎన్నికల్లో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఎలక్షన్ లో పాల్గొని ఓట్లు వేసి జగన్ ప్రభుత్వాన్ని గెలిపించారు. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు మర్చిపోవడం సహజం.
జగన్ ప్రభుత్వం కూడా అందులో ఏమి తీసిపోలేదు. ఇచ్చిన హామీలను ఎప్పుడో తుంగలో తొక్కింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యోగస్తులు ఎన్నిసార్లు అడిగినా జగన్ మాత్రం దాటవేస్తూ వస్తున్నారు. ఓపిక నశించి పోయిన ఉద్యోగస్తులు ఆందోళన బాట పట్టారు. జగన్ ప్రభుత్వంతో ఉద్యోగస్తుల ఎన్నిసార్లు చర్చలు జరిపిన కూడా సిపిఎస్ రద్దు చేయడం కుదరదని తేల్చేయడంతో ఉద్యోగస్తులు చాలా కోపంగా ఉన్నారు.
ప్రభుత్వం సౌలభ్యం కోసం, అధికారం కోసం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అని మమ్మల్ని మోసం చేశారు అని జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉద్యోగులు ఇలా ఉంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ సమస్య నుండి జగన్ ఎలా బయటపడతారో? తన ప్రభుత్వాన్ని ఎలా గెలిపించుకుంటారో వేచి చూడాల్సిందే.