Food Poisoning : మహబూబాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థినులకు పాఠశాలలో ప్రాథమిక చికిత్స చేసి, తర్వాత మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులల్లో 20 మంది తీవ్ర అస్వస్థతకు, మరో 30 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
చికిత్స చేసిన వైద్యులు, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని తెలిపారు. కలుషితమైన ఆహారం తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్ కి వచ్చారు. తమ పిల్లలకి కలుషిత ఆహారం పెడుతున్నారని,
నాణ్యత లేని ఆహారాన్ని తమ పిల్లలలకి పెట్టడంతో పాటు, హాస్టల్ లో సరైన శుభ్రత కూడా ఉండదు అని సిబ్బందిపై మండి పడ్డారు. ఇంతకుముందు పలుమార్లు వసతి గృహంపై పారిశుద్ధ్య సిబ్బందికి ఫిర్యాదు చేసిన వీళ్ళ తీరులో మార్పు రాలేదని.. అందుకే ఈ రోజు తమ పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.