Desamuduru Re Release : ఈ మధ్య కొత్త సినిమాల రిలీజ్ కు సైతం రాని ఎక్సయిట్మెంట్ రీ రిలీజ్ ని చూశాక వస్తోంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి, బిల్లా, ఖుషి వంటి సినిమాలు రాగా.. ఈ క్రమంలో టాలీవుడ్ మరో స్టార్ హీరో సినిమా ఈ లిస్టులో చేరింది. ఐకాన్ స్టార్ హీరోగా తెరకెక్కిన దేశముదురు సినిమా రీరిలిజ్‌కు సిద్ధమైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ‘దేశముదురు’ సినిమా ఒకటనే విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా హన్సిక హీరోయిన్ గా నటించింది. చక్రి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా, DVV దానయ్య దీన్ని నిర్మించాడు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ సినిమాను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. దేశముదురు సినిమాకు కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4K రిజల్యూషన్, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో పాటు అదే రోజు పుష్ప 2 గ్లిమ్స్ కూడా రానుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.