Pavitra Naresh marriage : పవిత్ర లోకేష్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో పవిత్ర సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు, వివాదాలతోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది. సీనియర్ నటుడు నరేష్‌తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వారిద్దరూ మీడియా ముందే మాట్లాడారు.
ఆ తర్వాత వీరిద్దరిపై జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. అనేక మలుపులు, గొడవలు వివాదాల నడుమ ఎట్టకేలకు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యింది. సీనియర్ నటులు నరేశ్ -పవిత్ర కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొత్త ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెడతామని 2022 డిసెంబర్ 31న నరేశ్ ప్రకటించారు. తాజాగా వీరిద్దరూ కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
వీరి వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడుముళ్ళు, ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ పవిత్ర నరేష్ అని ట్విట్టర్ లో వీడియో షేర్ చేశారు. అయితే నరేష్ తన మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకోవడం గమనార్హం.
Congratulations and Best Wishes to #PavitraNaresh
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 10, 2023