Naatu Naatu Oscar : ఎన్నోరోజులుగా యావత్ భారత్ ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు పొందిన ‘RRR’కు ఆస్కార్ అవార్డు దక్కింది.

USలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరిగిన వేడుకలో ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో అవార్డు పొందింది. ఈ పాటను రాసిన చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి వేదికపై అవార్డు అందుకున్నారు.
నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు అనౌన్స్ చేయగానే డాల్బీ థియేటర్ రాజమౌళి, రామ రాజమౌళి తదితరుల ఈలలు, కేరింతలతో థియేటర్ మార్మోగిపోయింది. అంతకు ముందు నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్‌కు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలను వేదికపైకి ఇన్వైట్ చేశారు దీపికా పదుకొనె.
'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023
