Morning Motivation:మేల్కొలుపు-14
లేవెల్ కోసం పాకులాడే మొహాలు..
సాటి మనిషిని తులనాడే మొహాలు..
మనిషి మాటని చంపేసి..
తన ఆధిపత్యం చూపించుకోవాలి అనుకునే మొహాలు…
మనుషులని తమ అవసరాలకు వాడేసుకుని..
నేనే మొత్తం చేసాను అని చెప్పుకునే మొహాలు..
వీళ్ళతో సహజీవనం చేస్తున్న సమాజంలో ఉన్నాం…
నీ సహజత్వాన్ని నీవు మర్చిపోతే…
గుంట నక్కలు” కూడా నిన్ను వేటాడుతాయి.
జీవితంలో మన కళ్ళు చూసిన నిజాలకంటే..
చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి.
మన సర్కిల్ చాలా చిన్నది.
ఎందుకంటే మనం నంబరు కంటే నాణ్యతను ఇష్టపడతాము……కాబట్టి
మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు…
వాదించడం ఇష్టం లేకపోవడం..
ఓటమి మనిషిని ఒంటరిని చేస్తుంది..
కానీ
తిరుగులేని విజయానికి తియ్యటి జ్ఞాపకమౌతుంది.
మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం..??
చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా.
సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు..
అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది.
నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.
డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనర్థాలకు హేతువులు.
కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు..
కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.
దుష్టులకు దూరంగా ఉండాలి..
కానీ
వారితో విరోధంగా ఉండకూడదు.
ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషీ వెనక్కు వెళ్ళాల్సిందే.
ఇప్పటివరకూ వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే…
గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటమే…
శుభోదయం
