అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి గత ప్రధానులు చేయని ఎన్నో పనులను చేస్తూ ముందుకెళ్తున్న ప్రధాని మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు.
గతంలో బిజెపి తరపున ప్రధాని గా చేసిన వాజ్ పేయి 2268 రోజులు ప్రధానిగా పని చేయగా, నేడు మోడీ దాన్ని అధిగమించారు. మొత్తంగా అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన కంటే ముందు నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లు తొలి మూడు స్ధానాల్లో ఉన్నారు. ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడి మొదటి స్థానంలో ఉన్నారు.