Das Ka Dhamki Pre Release Event : విష్వక్సేన్ మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ ను పెంచుకునే దిశగానే సినిమాలు చేస్తున్నాడు. మొన్న అశోకవనంలో అర్జున కల్యాణంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరించిన విశ్వక్. తాజాగా దాస్ కా ధమ్కీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రంలో విశ్వక్ హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా.. విష్వక్సేన్ జోడీగా నివేదా పేతురాజ్ నటించగా లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. దాస్ కా ధమ్కీని వణ్మయి క్రియేషన్స్ నిర్మించగా ఈ మార్చ్ 22 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.
అయితే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 17న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. ఈ మూవీతో విశ్వక్ పాన్ ఇండియా లెవెల్ హీరో అవుతాడో లేదో చూడాలి.