Custody Teaser : గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్‌కు “థాంక్యూ” బ్రేకులు వేసింది. ఇటీవల బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాతో ఆకట్టుకున్న చైతూ.. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా చిత్రబృందం టీజర్‌ను రిలీజ్చేసింది.
అరవింద్ స్వామి తన విలన్ యాక్టింగ్ తో టీజర్‌కి ఇంటెన్సిటీ తెచ్చాడు. శరత్‌కుమార్‌తో పాటు ఇతర నటీనటులు కూడా టీజర్లో కనిపిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ అదిరిపోయింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 12న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Discussion about this post