Whether Report:తెలంగాణాలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకి ఎల్లో అలెర్ట్
వేసవి తాపం వేల ప్రజలకి ఉపశమనం లభించే వార్త అయినా, రైతన్నల పాలిట మాత్రం చేదు వార్తే. పంటలు వేసుకున్న రైతుల పాలిట మాత్రం డేంజర్ బెల్స్ మోగించడానికి అకాల వర్షాలు రెడీ అయ్యాయి. ఇప్పటికే ఆంధ్రాలో పలుచోట్ల మొదలైన వర్షాలు, రానున్న నాలుగు రోజులపాటు ఆంధ్రాతో పాటు తెలంగాణా లో కూడా తమ ప్రతాపం చూపించడానికి సిద్ధం అయ్యాయి.
రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్,నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాలకి ఎల్లో అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ, అవసరం ఉంటే తప్ప భయటికి రావద్దని తగు సూచనలు చేసింది.