World Boxing Championship: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ శుభారంభం…రెండో రౌండ్లోనే తేలిన ఫలితం
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణా యువ బాక్సర్, డిపెండింగ్ ఛాంపియన్ ఒలంపిక్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్ శుభారంభం చేసింది.50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన డిపెండింగ్ ఛాంపియన్ జరీన్ తన మొదటి మ్యాచ్ లో అజర్ బైజాన్ కి చెందిన అనాఖనిమ్ పై గెలుపొందింది.
మ్యాచ్ ఆరంభం నుండే ఎదురుదాడికి దిగిన జరీన్ చివరి వరకు పూర్తి ఆధిపత్యం కనబరిచింది.దీనితో మ్యాచ్ లో రెండో రౌండ్ కే ఫలితం తేలిపోయింది.అయితే జరీన్ తన తదుపరి పోరులో అల్జీరియా కి చెందిన రౌమెసా బౌలమ్ తో తలపడనుంది.మరోవైపు 52 కేజీల విభాగంలో భారత బాక్సర్ సాక్షి కొలంబియా కి చెందిన మరియా జోస్ పై గెలిచింది.