Srinagar Tulip Garden : ఆసియాలోనే అత్యంత పెద్ద తులిప్ గార్డెన్ శ్రీనగర్ లో ఉంది. ఇక్కడ కొన్ని మిలియన్ల తులిప్స్ ఉంటాయి. ఈ గార్డెన్ ని కాశ్మీర్ యొక్క ప్రధాన పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. 9 నెలలు మూసి ఉంచే ఈ గార్డెన్ ను ప్రతి ఏడు మార్చిలో తులిప్ ఫెస్టివల్ సందర్భంగా తెరిచి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్ట్‌లు మరియు సమావేశాలు నిర్వహిస్తారు.