Rahul Gandhi:బిగ్ బ్రేకింగ్…రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్ట్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది గుజరాత్ లోని సూరత్ కోర్ట్.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ తీర్పు వెల్లడించినట్టు తెలిపింది.
గతంలో 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ , మోదీ ఇంటిపేరును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దీనిపై గుజరాత్ BJP ఎమ్మెల్యే రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు.విచారణ జరిపిన గుజరాత్ లోని సూరత్ కోర్ట్ తాజాగా రాహుల్ కి రెండేళ్లు జైలు శిక్ష విధించింది.