Kidney Problems : ఈ రోజుల్లో అందరిని బాధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో కిడ్నీ సమస్య ప్రధానమైనది. మన శరీరంలో కిడ్నీలది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అనేది అందరికీ తెలిసిందే.. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు, రోజుకి పెరిగిపోతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలు పాడవకుండా కాపాడుకోవచ్చు.
కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే..
★ మనం తినే ఆహారంలో ఉప్పు కాస్త తక్కువ అయినా కూడా తినలేము. కానీ ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే ఉప్పులో ఉండే సోడియం మన శరీరంలో రక్తపోటును పెంచుతుంది. అలా రక్తపోటు పెరిగితే దాని ప్రభావం కిడ్నీల పై పడుతుంది. కాబట్టి ఉప్పును తగిన మోతాదులో తీసుకొని కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండండి.
★ కొందరు కొన్ని పరిస్థితిల్లో మూత్రాన్ని అపుకుంటూ ఉంటారు. అలా అపుకోవడం వల్ల మూత్రశయం నిండి పోయి కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ కలిగేలా చేస్తుంది.
★ చాలామందికి మద్యం సేవించడం, ధూమపానం అలవాటులు ఉంటాయి, ఇలాంటి అలవాట్లు కిడ్నీలు పాడవడానికి ఎక్కువగా దోహద పడతాయి.
★ చాలామంది ఒంట్లో ఏదైనా నొప్పి వస్తే వెంటనే.. పెయిన్ కిల్లర్స్ వాడుతారు. కానీ అలా వాడటం కిడ్నీలకు చాలా ప్రమాదం, అలా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వాటి ప్రభావం కిడ్నీల మీద పడే అవకాశం ఎక్కువని వైద్యులు చెప్తున్నారు.
★ కొందరికి నాన్ వెజ్ తినడం బాగా అలవాటు గా ఉంటుంది. కానీ నాన్ వెజ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ మోతాదుకు మించి తీసుకుంటే అదే మన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. దాని ప్రభావం ఎక్కువగా కిడ్నీల మీద పడుతుంది. దానివల్ల కిడ్నీలాల్లో రాళ్లు రావడం, కిడ్నీ పనితీరు మందగించడం జరుగుతుంది. కాబట్టి నాన్ వెజ్ వారానికి రెండుసార్లకు మించి తీసుకోకపోవడమే మంచింది.