Vidhyuth Employees Dharna:నేడు విధ్యుత్ కార్మికుల “చలో విధ్యుత్ సౌధా”….సియం హామీలు అమలుపరచాలని డిమాండ్
నేడు తెలంగాణా రాష్ట్రంలోని విధ్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్స్, ఇతర కార్మికులు అంతా కలిసి, తమ డిమాండ్స్ సాధన కోసం చలో విధ్యుత్ సౌధాకి రెడీ అయ్యాయి. ఉద్యోగులు, ఆర్టిజన్స్, కార్మికులకు కొత్త PRC వెంటనే అమలుపరచడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని, లేని పక్షంలో సమ్మెకు కూడా వెనుకాడేది లేదని నేడు హైదరాబాద్ లోని విధ్యుత్ ప్రధాన కార్యాలయం ముందు మహా ధర్నాకి సిద్ధం అయ్యాయి.

ప్రధానంగా EPF టు GPF, PRC, ఆర్టిజన్ల క్రమబద్దీకరణ తో పాటు 29 న్యాయమైన డిమాండ్స్ పై నేడు ధర్నా జరగనున్నట్టు తెలిపాయి.కొత్త PRC ఏడాది కాలంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ముఖ్యంగా 23,000 మంది ఆర్టిజన్ల కి అసెంబ్లీ సాక్షిగా సియం ఇచ్చిన హామీలు విస్మరించారని, వారికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి వేతనం ఇస్తామని చెప్పి నేటికీ అమలుపరచకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని వాపోయారు .
ఇప్పటికే పలు డిమాండ్లపై యాజమాన్యం తో పలుసార్లు ఉద్యోగులు, కార్మికులు చర్చలు జరిపినప్పటికీ, అవి ప్రభుత్వ వైఖరితో విఫలం కావడంతో, ఉద్యోగులు కార్మికులు చివరి అస్త్రంగా నేడు చలో విధ్యుత్ సౌదాకి పిలుపు ఇవ్వడం జరిగింది. మింట్ కాంపౌండ్ లో గల విధ్యుత్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకి సిద్ధం అయ్యాయి.ఈరోజుకి కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు.
