Interesting Facts : ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బును బట్టి ఆ వ్యక్తిని ధనవంతుడు అని చెప్పొచ్చు. లేదంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్న పదవిని బట్టి ఆ వ్యక్తి స్థాయిని చెప్పొచ్చు. కానీ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తిని ఎలా గుర్తిస్తాము.! కానీ గుర్తించారు.. ఈ భూమ్మీద అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు.
ఆ వ్యక్తి ఎవరో ఆ సంతోషం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వ్యక్తి పేరు మ్యాథియో రీఛార్డ్. ఈయన ఫ్రాన్స్ కి చెందిన మార్కులర్ బయాలజిస్ట్. కానీ సుమారు 50 సంవత్సరాల క్రితం అన్ని వదిలేసుకుని ఇండియాకి వచ్చి బుద్ధిష్ట్ మామ్ గా మారిపోయారు. అయితే ఈయననే హ్యాపీయస్ట్ మ్యాన్ గా ఎందుకు సెలెక్ట్ చేశారంటే..
రిస్కోన్ యూనివర్సిటీ వాళ్ళు ఈయన మీద 12 సంవత్సరాల పాటు రీసర్చ్ చేశారు. ఈయన మెడిటేషన్ చేసేటప్పుడు ఈయన బ్రెయిన్ కి 256 సెన్సార్లను అమర్చారు. ఈయన మెడిటేషన్ చేసేటప్పుడు గామా లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఆ రేంజ్ లో ఎవరికి ఇంతలా రిలీజ్ అవ్వలేదు అంట. ఇలా స్కాన్ చేసినప్పుడు ఈయన చాలా సంతోషంగా ఉండే వ్యక్తి అని గుర్తించారు. ఇదే రీసెర్చ్ ని కొన్ని వందల మంది మీద చేసారు. కానీ ఈ స్థాయిలో ఇంత హ్యాపీగా ఉన్నవారిని ఎవరిని రీసెర్చ్ లో కనుగొనలేకపోయారు.
అలాగే ఈయన మనం కూడా ఎలా హ్యాపీగా ఉండాలో కొన్ని టిప్స్ చెప్పారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఉంటే దాని గురించి ఆలోచించాలి. సొల్యూషన్ లేనప్పుడు దాని గురించి ఆలోచించడం మానేయాలి. లేకపోతే ఆ సమస్య గురించి బాధపడడం అవుతుంది.
* ఇతరుల తో పోల్చుకోవడం అనేది మనల్ని కృంగదీస్తుంది. మనం ఆ పోల్చుకోవడం కూడా ఏ బిల్ గేట్స్ తోనో, వేరే గొప్ప వ్యక్తులతోనో పోల్చుకోము. కేవలం పక్కింటి వాళ్ళతోని, ఎదురింటి వాళ్లతోనే పోల్చుకుంటాం. కాబట్టి ఈ పోల్చు కోవడం అనేది మనిషిని ఇంకా కృంగదీస్తుంది. అలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవాలి అని చెప్తున్నారు.
* ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు మెడిటేషన్ చేయాలి అలా చేయడం వల్ల హ్యాపీనెస్ లెవెల్స్ పెరుగుతాయని మ్యాథియో సలహా ఇస్తున్నారు.