Health Tips : కొంతమంది ఏ చిన్నా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. కానీ ప్రతీదానికి టాబ్లెట్స్ వాడితే అది ఆరోగ్యానికే హానికరం. అవసరానికి మించి టాబ్లెట్స్ వాడితే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
* ఒక్కోసారి సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు వాడుతుంటారు. అలా వాడడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* తలనొప్పి, జలుబు లాంటి చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలు కొంత ఓపికతో ఉంటే తగ్గుతాయి. అలా కాకుండా నొప్పి వచ్చిన వెంటనే మందులు వాడడం అనేది మంచిది కాదు. సమయం మించిపోయినా సమస్య తగ్గు ముఖం పట్టకపోతే డాక్టర్ ని సంప్రదించి అప్పుడు మందులు వాడడం మంచిది.
* చాలామంది వ్యాధి ఏంటో నిర్ధారణ కాకమునుపే ఒక్కోసారి మందులు వాడేస్తుంటారు. రోగ నిర్ధారణ అయిన తర్వాతే టాబ్లెట్స్ వాడాలి.
* అలాగే మితిమీరిన మందులు వాడితే మాత్రం మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే కాకుండా టాబ్లెట్స్ అతిగా వాడితే కిడ్నీల మీద ప్రభావం పడుతుంది.
* అస్తమానం ఆరోగ్య సమస్యలు వేధిస్తే మాత్రం ఆహారపు అలవాట్లను మార్చుకొని మార్పును గమనించాలి.
Discussion about this post