Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ SSMB28. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా
ఓ భయంకరమైన విలన్ పాత్రలో సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ వదిలారు మేకర్స్. మాస్ అవతార్ 2024 సంక్రాంతి 13న మిమ్మల్ని కలుస్తాడు అంటూ ఓ అదిరిపోయే పోస్ట్ రిలీజ్ చేశారు.
దీన్ని బట్టి మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉండనుందని అర్థమవుతుంది. అయితే ఈ మూవీ ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు మొదట ప్రకటించారు కానీ కొన్ని అనివార్య కారణాలతో సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు. దీంతో ఆగస్టు 11న మెగాస్టార్ భోళా శంకర్ విడుదల కానుంది.