Interesting Facts : సొంత ఇల్లు కట్టుకొని అందులో సంతోషంగా జీవించాలి అని ప్రతి ఒక్కరు కలలుగంటారు. అందులోనూ ఇంటి చుట్టూ మంచు పర్వతాలు ఉండి, సముద్రానికి దగ్గరగా ఉంటే.. ఆహా.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా..!? అందమైన ఊరు చూపించి.. అందులో ఒక అందమైన ఇల్లు చూపించి..
ఆ ఇంట్లో జీవిస్తే బదులుగా తిరిగి డబ్బులు చెల్లిస్తాం అని.. అవి కూడా వందలు, వేలు కాదు ఏకంగా 49 లక్షల పైననే డబ్బులు ఇస్తాము అంటే.. ఇది ఇంకా అద్భుతంగా ఉంది కదా.. అవునూ.. మీరు విన్నది నిజమే ఒక ఇంట్లో జీవించినందుకు ప్రభుత్వం ఏకంగా రూ. 49 లక్షలు ఇస్తాం అని ప్రకటించింది..

ప్రభుత్వమే ఎందుకు డబ్బులు చెల్లిస్తుంది..
మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న గ్రామం స్విజార్లాండ్ లోని అల్బీనెన్ గ్రామం. ఇది ఫ్రాన్స్, ఇటలీ మధ్య సరిహద్దులోని వలైస్ లో ఉంది. అయితే 2018 నుండి ఈ గ్రామం జనాభాను పెంచడం కోసం ప్రభుత్వం కొత్త పంథా ఎంచుకుంది. ఈ గ్రామంలో జనాభా క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ఈ అల్బీనెన్ గ్రామం కొండ ప్రాంతానికి సంబంధించింది. అక్కడ ఇల్లులన్నీ కొండ ప్రాంతం పైనే ఉంటాయి. అయితే ఆ ఊరిలో నిరుద్యోగ సమస్య ఎక్కువ. ఆ ప్రాంతమంతా కొండ ప్రాంతం అయ్యేసరికి అక్కడ పరిశ్రమలు గానీ, కంపెనీలు కానీ మొదలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఈ ఒక్క కారణంతో అక్కడ ఉన్న నిరుద్యోగులు అందరూ వేరే ఊర్లకు వలస వెళ్లిపోతున్నారు.

దీంతో ఆ ఊరు కొద్దికొద్దిగా ఖాళీ అవడం మొదలైంది. ప్రస్తుతానికి ఆ ఊర్లో ఉన్న జనాభా సంఖ్య 250 కుటుంబాలు మాత్రమే. ఈ ఊహించని పరిణామంతో ప్రభుత్వం షాకైంది. ఇలా ఖాళీ అయిపోతే ఆ టౌను మొత్తం నిర్మానుష్యం అయిపోతుందని ఓ ఉపాయం ఆలోచించింది. అల్బీనెన్ గ్రామంలో నివాసం ఉంటే ప్రభుత్వం 49 లక్షల పైనే డబ్బులు చెల్లిస్తామని ప్రకటించింది.
షరతులు వర్తిస్తాయి..
* ఈ ఆఫర్ 45 ఏళ్లలోపు వారికి మాత్రమే.
*ఆ ఇంటిలో నివసించాలి అంటే మాత్రం తప్పనిసరిగా స్విట్జర్లాండ్ పౌరుడై ఉండాలి. సి పర్మిట్ కూడా కలిగి ఉండాలి.
*పదేళ్లు ఇంటిలో ఉంటే ఇంటి విలువ పెరుగుతుంది. అంతకంటే ముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వానికి తిరిగి మనమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
