Children’s Health : వేసవి వచ్చిందంటే చాలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు సెలవు రోజులు కావడం వల్ల ఎండలో ఎక్కువగా ఆటలు ఆడడం కోసం బయటకు వెళ్తుంటారు. పిల్లల్ని బయటకు వెళ్లకుండా ఆపడం ఇంట్లో వాళ్లకి పెద్ద టాస్క్. పిల్లలకి ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తపడి వాళ్ళని సమ్మర్ కూడా ఎలా ఎంజాయ్ చేయించాలో కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకుందాం.
* పిల్లలను ఎండ ఎక్కువగా ఉన్న టైంలో బయటకు పంపకపోవడమే మంచిది.
* ఎండ ఎక్కువైతే సూర్యుడి నుండి వచ్చే కిరణాలు, వేడి వల్ల చెమట ఎక్కువగా వచ్చి వడదెబ్బ తగిలి పిల్లలలో ఆరోగ్యం దెబ్బతింటుంది.
* ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఫ్లూతో బాధపడుతూ ఉంటారు. వేసవికాలం పిల్లలకు ఈ భాద ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి సరైన పోషకాహారం అందించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* వేసవిలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలు తాగడానికి పిల్లలు ఇష్టపడుతుంటారు. దాని వల్ల గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి అలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలి.
* ఎండాకాలం దోమలు బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకొని వాటి నుండి పిల్లలను రక్షించాలి.
* వేసవిలో నీళ్లు తగినంత తీసుకోకపోతే డిహైడ్రేడ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఏడు, ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగేలాగా చూసుకోవాలి.
* పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. శుభ్రత, నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్వచ్ఛమైన పండ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న వాటిని పిల్లలకు ఆహారంగా పెట్టాలి.
* వేసవిలో పిల్లలకు చెమట ఎక్కువగా వస్తుంది. కాబట్టి బిగుతుగా ఉన్న దుస్తులు వేయకుండా, తేలికపాటి కాటన్ దుస్తులు వేయాలి. కాటన్ చెమటను పీల్చుకొని వారికి చిరాకును దురదను కలిగించకుండా ఉంటుంది.