Interesting Facts : మానవుని పొట్ట భాగం ఏమి చేస్తుంది? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అంతేకదా.. ఇప్పటివరకు మనకు తెలిసింది ఇంతే.. ఇదంతా బాగానే ఉంది కానీ, అదే మానవుని కడుపు “రేజర్ బ్లేడ్స్” ని కూడా కరిగించగలదు. అవునూ మీరు విన్నది నిజమే.. సైన్స్ లో ఉన్న అద్భుతమైన వాస్తవాలలో ఇది కూడా ఒకటి. సైన్స్ లో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఒక్కో అద్భుతం వెనుక ఒక్కో రహస్యం దాగి ఉంటుంది.

మానవుని కడుపులో బ్లేడు ఎలా కరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మానవుని శరీరంలోని ఆమ్లాలు 0 నుండి 14 వరకు ఉంటాయని స్కేల్లో వర్గీకరించబడ్డాయి. అయితే మానవ శరీరంలో ph ( potentiol of Hydrogen ) స్థాయి తక్కువగా ఉంటే ఆమ్లం స్థాయి బలంగా ఉంటుంది. అదేవిధంగా కడుపులో ph స్థాయి 1౼3 ఉంటే కనుక ph స్థాయి విలువ చాలా బలంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ఆమ్లానికి రెజర్ బ్లెడ్ ని కూడా కరిగించే శక్తి ఉంటుంది..అని ఒక అధ్యయనంలో కనుగొనబడింది.
పైన చెప్పుకున్న విధంగా మన కడుపులో ఉన్న ఆమ్లంలో కొన్ని గంటల గనుక బ్లేడు ఉంటే ఆ బ్లేడును మన కడుపులో ఉన్న ఆమ్లం కరిగించేస్తుంది. కాబట్టి అనుకోకుండా, ప్రమాదవశాత్తు మన కడుపులోకి బ్లేడు వెళ్లిన భయపడాల్సిన అవసరం లేదు. అలా అని ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేయకండి. బ్లేడు కడుపులోకి వెళ్తే గొంతును కోస్తూ కడుపులో ఉన్న పేగులను కూడా కోసేస్తుంది. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం రావచ్చు.
