Director Sukumar : ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు లక్ కూడా కలిసి రావాలి. అదే డైరెక్టర్ గా గుర్తింపు పొందాలి అంటే మంచి గురువు కూడా ఉండాలి. ఇటీవల హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్స్ ని చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఇండస్ట్రీలో అందరూ గురువుగారు అని పిలుచుకునే దాసరికి శిష్యులు ఎక్కువ. సినిమా రంగంలో దాసరి అనే మహావృక్షం అనేక మంది సినిమా పక్షులకి గూడుగా ఉపయోగపడింది.
ఓ దశలో కొత్త డైరెక్టర్స్ అంతా ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని వచ్చిన వారే. ఆ తర్వాత వర్మ స్కూలు మొదలైంది. వర్మ నుంచి స్ఫూర్తి పొందో, ఆయన దగ్గర పనిచేసో.. దర్శకులైన వాళ్లు అనేకం. అనంతర కె.రాఘవేంద్రరావు, వినాయక్.. కూడా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగారు. కానీ ఈ మధ్య కాలంలో పెద్ద డైరెక్టర్స్ నుంచి వచ్చిన శిష్యులు అంతగా రాణించలేకపోతున్నారు.
రాజమౌళి శిష్యులు దర్శకులై, సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ. ఇంకా త్రివిక్రమ్, బోయపాటి శిష్యులు కూడా అంతే. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం తన పాఠశాల నుంచి ఎప్పటికప్పుడు శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఉప్పెనతో బుచ్చిబాబు టాప్ డైరెక్టర్ అయిపోగా గ్లోబల్ స్టార్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలతో మూవీ చేసే స్థాయికి ఎదిగాడు.
కుమారి 21F, 18 Pages డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ కూడా తానేంటో ప్రూ చేసుకున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా త్వరలో విడుదల కానున్న విరూపక్ష డైరెక్టర్ కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే. తాజాగా సుక్కు స్కూల్ నుంచి వచ్చిన శ్రీకాంత్ ఓదెలా మొదటి సినిమా దసరా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ ఓదెలా ఓ సెన్సేషన్ డైరెక్టర్.
చాలా మంది బడా నిర్మాతలు శ్రీకాంత్ కి అడ్వాన్స్ లు ఇవ్వడానికి క్యూ కడుతున్నారు. కానీ శ్రీకాంత్ ఇంకా ఎవరికి కమిట్ అవ్వలేదు. నాని దసరా మూవీలో గురువుగారి రంగస్థలం ఆనవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తాయి. శిష్యుల సక్సెస్ లో సుక్కు వాటా లేకపోలేదు. ఇక నించి ‘సుకుమార్ శిష్యులమండీ’ అంటే చాలు.. ఈజీగా అవకాశాలు వచ్చేస్తాయి. అదీ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన శిష్యుల డిమాండ్.
Discussion about this post