DASARA Movie Collections :దమ్ము చూపిస్తున్న దసరా… త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి..??
నేచురల్ స్టార్ నాని నటించి తాజాగా విడుదల అయిన మూవీ “దసరా”.అయితే విడుదల అయినప్పటినుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్లలో దుమ్ము రేపుతూ, నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అత్యధిక వసూళ్లతో దూసుకెలుతుంది.
గురువారం విడుదల అయిన ఈ మూవీ 3 రోజుల్లోనే ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.68.45 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.గురువారం రూ.38.40 కోట్లు,శుక్రవారం రూ.14 కోట్లు, శనివారం రూ. 16.05 వసూళ్లు వచ్చాయి.కేవలం రెండు తెలుగు రాష్ట్రల్లోనే రూ.45.50 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది.ఇవాళ ఆదివారం కావడం తో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే ఊపు చూస్తుంటే త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని సినీ పండితుల అంచనా