Food Habits : మనం ఏదన్నా చిరాకులో ఉన్నప్పుడు మూడ్ బాగోనప్పుడు ఏం తినాలని అనిపించదు. అదే ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తింటుంటాం. అయితే మన భారతీయుల్లో 72 శాతం మంది మాత్రం సంతోషంగా ఉన్నప్పుడు చిరుతిల్లు ఎక్కువగా తింటున్నారాని అధ్యయనంలో వెల్లడైంది. భోజనం ఎలాగో చిరుతిల్లు కూడా మన జీవితాల్లో భాగం అయిపోయాయి.
ఒక అధ్యయనం ప్రకారం, మనిషి మానసిక స్థితికి,చిరుతిళ్ల వినియోగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మెజారిటీ భారతీయులు దీనిని అంగీకరించడం విశేషం. స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఆనందంగా ఉన్నప్పుడు స్నాక్స్ తింటారు. చిరుతిళ్లు తిన్న తర్వాత 70 శాతం మంది చాలా ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.
ఇందులో ముంబై, పూణే, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, కలకత్తా, చెన్నై , బెంగళూరు వంటి 10 నగరాల్లో ఎక్కువశాతం ఆనందంగా ఉన్నారని తెలుస్తుంది. సర్వే ప్రకారం భారతీయుల్లో 72 శాతం మంది సంతోషంగా ఉన్నప్పుడు, 56 శాతం మంది బోర్‌గా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ తింటామని 40 శాతం మంది విసుగును అధిగమించడానికి ఎక్కువగా చిరుతిల్లు తింటామని,
అవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయని చెప్పారు. భారతదేశంలోని సగానికి పైగా తల్లిదండ్రులు చిరుతిళ్ళను మిని మీల్స్‌గా భావిస్తారు. ఇది మాత్రమే కాదు, భారతదేశంలోని తల్లిదండ్రులలో మూడింట ఒక వంతు మంది దీనిని ఫుల్ మీల్‌గా అనుకోవడం, ఈ విషయాన్ని 34 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు అంగీకరించడం విశేషం.